Andhra Pradesh government filed affidavit against Kaleswaram project of telangana in supreme court.
#ysjagan
#kcr
#kaleswaramproject
#polavaramproject
#apaffidavitinsupremecourt
#Andhrapradesh
#telangana

ఏపీ..తెలంగాణ ముఖ్యమంత్రుల నాటి హామీలు ఏమయ్యాయి. ఏ సమస్య అయినా తెలుగు ప్రజల భవిష్యత్ కోసం చర్చలతోనే పరిష్కరించకుంటామన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు పలు దఫాలు భేటీలు నిర్వహించారు. ఏపీ సీఎం జగన్ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్లారు. ఇప్పుడు అదే ప్రాజెక్టు పైన అభ్యంతరాలతో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా, విచక్షణా రహితంగా తెలంగాణ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించే అంశాన్ని పరిశీలించొద్దని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. తెలంగాణ భాజపా నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో తెలంగాణ ప్రభుత్వ అఫిడవిట్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.